ప్రాంతీయం

తిగుల్ లో ఘనంగా మహిళ దినోత్సవం :- మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్

135 Views
  1. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో మట్టి మనిషి పౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో సమాజ సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు, ఆశావ్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ పరశురామ్, గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు , పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలేనని, ఆమె లేనిది సృష్టియే లేదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఇంటికి వెలుగు జగతికి జ్యోతులు మహిళలని, మహిళల పై దాడులను సహించేది లేదన్నారు. సమాజంలో మార్పు మహిళలతోనే సాధ్యమని చెప్పారు. మహిళలు సాధికారత సాధించాలని కోరారు. మహిళలందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *