ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, నామపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు రావడంతో రైతులు పార్టీ నాయకులు గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. మండు వేసవిలో నీళ్లు తెచ్చిన కేసీఆర్ కృతజ్ఞత తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ విజయ, గ్రామ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
