నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోట కిష్టమ్మకు 60000 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, వీరరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





