భద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం గోటితో ఓడ్లను వొలిచి పంపే కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామకోటి రామరాజు శనివారం మహాలక్ష్మీ హోమ్స్ లో కోటి తలంబ్రాలు దీక్షలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాచారం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తిమార్గం వైపు మల్లె విదంగా అందరితో రామకోటి లిఖింపజేస్తూ భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణం కొరకు కోటి తలంబ్రాలు దీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కైలాస ప్రభాకర్, ప్రశాంత్, సంతోష్ పాల్గొన్నారు.
