ప్రాంతీయం

అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

18 Views

అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.

మంచిర్యాల జిల్లా

అటల్ బిహారీ వాజపేయి జయంతి (101 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వ అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ నాయకులు మరియు క్రీడాకారులతో కలిసి వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు విలువలు నేర్పిన గొప్ప నాయకుడు వాజపేయి అని అన్నారు. వాజపేయి ప్రధాన మంత్రి గా ఉన్న సమయంలో పాకిస్థాన్ తో కార్గిల్ యుద్ధం సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకొని వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, ఎనగందుల కృష్ణ మూర్తి, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, బియ్యాల సతీష్ రావు, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, ఆకుల అశోక్ వర్ధన్, వైద్య శ్రీధర్, మెరెడికొండ శ్రీనివాస్, బుద్దారపు రాజమౌళి, నాగుల రాజన్న, ముల్కాల్ల తిరుపతి రెడ్డి, రెడ్డిమల్ల అశోక్, కిషోర్, బోయిని దేవేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *