ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం

168 Views
  • … కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం – ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డికంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో మసకబారి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరికో వెలుగులు పంచుతుందనీ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డిలు అన్నారు. మంగళవారం మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో విడత కంటివెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డి ఎంపీడీఓ ప్రవీణ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యతో అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా సంబందిత అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చారని అన్నారు. అంతేకాకుండా కంటివెలుగు ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్య దూరం చేయడానికి అవసరమయిన వారికి కంటి అద్దాలు ఆపరేషన్ కూడా ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని తెలిపారు.ఇంత గొప్ప కార్యక్రమం తలపెట్టిన మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇంచార్జి మంత్రి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ & ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేస్తున్న వైద్య సిబ్బందికి అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎండి షకీల్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అంజి రెడ్డి మండల యూత్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి నాయకులు ధర్మా రెడ్డి హనుమంతరెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *