మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకర0
వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు
గజ్వేల్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేదిని రామలింగారెడ్డి మాట్లాడుతూ వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవి. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో కెసిఆర్ సర్కార్ విఫలం అయింది. అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న .కెసిఆర్. ఇంతవరకు గడీ దాటింది లేదు. కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే అల్లరిమూకలు రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రీతీని వేధించిన వ్యక్తితో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొని, అమ్మాయిలకు రక్షణ కల్పించాలని. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. ములుగు మండల అధ్యక్షుడు గామిడి నరేందర్ రెడ్డి. వర్గల్ మండల అధ్యక్షుడు చిదు ప్రభాకర్ రెడ్డి మరియు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రీతీ కి నివాళులు అర్పించారు
