ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీ కె. తారకరామారావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీఓ చిరంజీవి, తహశీల్దార్ జయంత్, తదితరులు పాల్గొన్నారు.
