*తిన్నది అరగకపోతే సొరియాసిస్! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది.
జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.*
న్యూఢిల్లీ, : ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
పూణెకు చెందిన ప్రముఖ వైద్యుడు ఆయుశ్ గుప్తా మాట్లాడుతూ జెనెటిక్, పర్యావరణ కారణాలున్నా..జీర్ణవ్యవస్థకు సొరియాసిస్‌కు సంబంధముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు. జీర్ణవ్యవస్థ దెబ్బతినటం, చిన్నపేగు, పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టిరియా తగ్గిపోవటం వల్ల సొరియాసిస్ బారినపడే అవకాశముందని తాజా పరిశోధనలు తేల్చాయి.
