ప్రాంతీయం

సీపీఐ పార్టీ నుండి బహిష్కరణ

29 Views

సీపీఐ నుండి జనగాం రాజు కుమార్ బహిష్కరణ..

పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం

పార్టీ నిబంధన,క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన కఠిన చర్యలు తీసుకుంటాం..

మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి, సిద్దిపేట

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, నవంబర్ 14

హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జనగాం రాజ్ కుమార్ పార్టీ నిబంధనలకు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. పార్టీ నాయకత్వం పలుమార్లు తమ వ్యక్తిత్వం మార్చుకోవాలని చెప్పినప్పటికి వినకుండా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సమావేశంలో ఆయన విధానం పట్ల చర్చించి అతనికి పార్టీ నిబంధనవళి ప్రకారం షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించి ఇవ్వడం జరిగింది. కానీ అతను షోకాజ్ నోటీసు తీసుకొని అతడు చేసిన పొరపాట్లను ఒప్పుకోకుండా జిల్లా పార్టీకి నిరక్ష్య సమాధానం ఇవ్వడంవల్ల జిల్లా సమితి రాజ్ కుమార్ ను పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. ఇక నుండి అతనికి పార్టీకి ఏలాంటి సంబంధం లేదని పార్టీ శ్రేణులకు,పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *