రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ యువకులు ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చారు.ఈ

Your message has been sent
సేవా కార్యక్రమంలో గ్రామస్తులు మేడిశెట్టి మల్లేష్, మామిండ్ల కిషన్, మాడిగపు శ్రీనివాస్, మేడిశెట్టి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం చేసిన ఈ స్వచ్ఛంద సేవను గ్రామ ప్రజలు అభినందించారు.స్వయంగా కృషి చేసి గ్రామానికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా వెంకటాపూర్ యువకులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.





