వర్షాల కోసం శ్రీరామునికి శ్రీరామ లిఖిత నామాలతో అభిషేకం
. సీతారాములను అభిషేకించిన రామకోటి రామరాజు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 7) :
సిద్దిపేట జిల్లా గజ్వేల్:
వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద ఆదివారం నాడు శ్రీరామునికి శ్రీరామ లిఖిత అమృత నామాలతో సీతారాములకు ప్రత్యేకంగా అభిషేకించి పూజించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురిస్తేనే రైతు ఆనందంగా ఉంటాడని రైతు ఆనందంగా ఉంటేనే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారన్నారు. దీని ఆధారంగా వ్యవసాయం ముందుకు సాగుతుందన్నారు. దేశానికి రైతే వెన్నుముఖ. అలాంటి రైతు సుఖంగా జీవించకుంటే పరిపాలన కూడా ఆస్థవ్యస్థంగా మారుతుందన్నారు. అనంతరం భజన కారిక్రమాలు నిర్వహించారు.
