తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి నియామకం తర్వాత మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ స్టేజి వద్ద తిమ్మాపూర్ మండల సిపిఐ కార్యదర్శి బోయిన తిరుపతి ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావుకి మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహిళలు మంగళ హారతుల తోటి నాయకులు పూల మాలలు వేసి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం తెలిపారు.
అనంతరం అలుగునూర్ నుండి ర్యాలీగా కరీంనగర్ లో జరుగుతున్న సిపిఐ కరీంనగర్ ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశానికి కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్లో నిర్వహించు సమావేశానికి హాజరైనారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, మండల సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ , నాయకులు సాయిల తిరుపతి, మర్రి కొమురయ్య ,ఎల్ల స్వామి, గంగిపల్లి శంకర్ ,వంగల భాస్కర్ రెడ్డి, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.




