ఆత్మహత్య యత్నం చేసుకున్న పీజి వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్, సిబ్బంది ని విషయంపై ప్రశ్నించినందుకు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ తో పాటు దళిత,గిరిజన నాయకుల అక్రమంగా అరెస్టు చేయాడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి తెలిపారు. గజ్వేల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ కెయు మెడికల్ కళాశాల కు చెందిన పిజి గిరిజన విద్యార్ధిని డాక్టర్ ప్రీతిని సినియర్ లవేధింపులకు పాల్పడటం వల్లనే ప్రీతి ఆత్మహత్య కు చేసుకోవాల్సిన దుస్ధితికి నెట్టబడిందన్నారు.ప్రీతి సంఘటన పై న్యాయ విచారణ జరిపించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.నిమ్స్ లో ప్రాణప్రాయ స్ధితిలో చికిత్స పొందుతున్న ప్రీతి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయకపొవడం సిగ్గుచెటన్నారు.ఈ విషయం పై ప్రశ్నించినందుకు రాజేందర్ తోపాటు దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దళిత సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.