సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు మొగ్గు చూపే విధంగా రామకోటి రామ నామాలను లిఖింపజేస్తు తన కళానైపుణ్యంతో ప్రత్యేక సందర్భాల్లో వివిధ చిత్రాలు వేస్తూ సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఆవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ భారీ చిత్రం అద్భుతం అని రామకోటి రామరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుర్గాప్రసాద్, కో అప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు, వార్డు ప్రసిడెంట్ రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు హరిని, సామాజిక కార్యకర్త సాదిక్ పాషా, నర్సింలు, హరి తదితరులు పాల్గొన్నారు.
