ప్రాంతీయం

కల్వర్టు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్తా జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్

136 Views

దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి గ్రామంలోని పల్లె చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానల్ పై కల్వర్టు అవసరం ఉన్నదని వారు తెలిపారు. ఈ కల్వర్టు వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిచ్చే ప్రయత్నం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పంజా స్వామి, గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, స్వామి తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *