జగదేవపూర్: మండల కేంద్రం లో గల మల్లికార్జున స్వామి దేవాలయం లో ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్.సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్.ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి. మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్.మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి.ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాజు.ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్.మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




