ఆధ్యాత్మికం

రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం

116 Views

రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం

భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారణం

– సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ

గజ్వేల్ , జులై 20

శ్రీరామ నామాన్ని తను లిఖిస్తూ నేడు లక్షల మంది భక్తులచే లిఖింపజేయడం వల్ల రామకోటి రామరాజు కృషి పట్టుదలకు గాను నేడు భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ అన్నారు. శనివారం నాడు గజ్వేల్ లో రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా యోగా గురువు నాగేష్ జీ మాట్లాడుతూ భక్తులకోసం శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థను స్థాపించి రామకోటి పుస్తకాలను అందిస్తూ గత 25సంవత్సరాల నుండి భక్తి పరమైన ధార్మిక కార్యక్రమాలు, మరియు సామాజిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం రామకోటి రామరాజు భక్తికి నిదర్శనం అన్నారు. రామకోటి రామరాజు అందించిన నామలేఖన పుస్తకాలలో మా నాన్న బొందుగుల గురుపాదం కోటి రామనామాలు లిఖించారన్నారు. నాక్కూడా రామనామాలు లిఖించే భాగ్యం ఆ స్వామి వల్లే కలిగిందన్నారు. లక్షల మందిని భక్తి మార్గంలో నడపడం అందకి సాధ్యం కాదన్నారు. రామకోటి రామరాజు కృషి, పట్టుదలతోనే నేడు సాధ్యం అయ్యిందన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్