ఆధ్యాత్మికం

పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు !

91 Views

పాండురంగ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు !

– ప్రత్యేక పూజలు నిర్వహించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు

మర్కుక్ ప్రతినిధి (జులై 18)

మర్కుక్ మండలం భవానందాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ ఆశ్రమంలోని 93వ ఆషాడ ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పుష్ప దంపతులు.

ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ పాండురంగని కరుణ కటాక్షాలతో పాడిపంటలు సమృద్ధిగా పండి రైతు చల్లగా ఉండాలని కోరారు. హరేరామ,హరేకృష్ణ నామ స్మరణ చేయడం వల్ల మనస్సుకు మనశాంతి కలుగుతుందన్నారు. రామ నామ స్మరణ సర్వ పాప హరణ అన్నారు. కడవరకు తోడుండేది రామనామం ఒక్కటే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కులకర్ణి రఘు, కొండకండ్ల పవన్ కుమార్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్