జగదేవపూర్ మండలం కొత్తపేట గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు నరేష్, ఆత్మ కమిటి చైర్మన్ రంగారెడ్డి, కో అప్షన్ ఎక్బల్, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి, జగదేవపూర్ గ్రామ అధ్యక్షులు నాచారం దేవాలయం డైరెక్టర్ నాగరాజు, సర్పంచ్ వెంకటరాం రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ భూమన్న, ఉపసర్పంచ్ మహేష్, కార్యదర్శి మల్లేశం, శివాజీ యూత్ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
