ఆధ్యాత్మికం

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు కన్నులపండువగా శివపార్వతుల కళ్యాణం..

232 Views

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు
కన్నులపండువగా శివపార్వతుల కళ్యాణం

ఎల్లారెడ్డి పేట మండలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి ,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సద్ది మద్దుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లో శివలింగానికి అర్చకులు రాచర్ల హనుమండ్ల శర్మ, శ్రీధర్ శర్మ లు సంఘం అధ్యక్షులు వంగ బాల్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి దంపతులతో రుద్రాభిషేకం , శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు,
అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గల పురాతన శివాలయం లో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి దంపతులు శివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు, అదేవిధంగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీ కాంత్ శర్మ ఆద్వర్యంలో రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేశారు రాత్రి శివపార్వతుల కళ్యాణం కన్నులపండువగా జరిగింది , మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం లోని వివిధ గ్రామాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి, శివుని పార్వతులకు కళ్యాణం , అభిషేకాలు పత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి,
ఈ సందర్భంగా నిర్వాహకులు భక్త కోటికి పంచామృతం , కందగడ్డ , పండ్లతో తయారు చేసిన ప్రసాదాన్ని , సీరా ప్రసాదాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు,
మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు,
ఎల్లారెడ్డిపేట మండలంలో ని వివిధ గ్రామాల్లో భక్తులు రాత్రంతా నీలారంతో ఉండి జాగరన చేశారు పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు,
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ‌సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ఎల్లారెడ్డిపేట బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు తదితరులు శివాలయాలు సందర్శించి స్వామి వారి ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, తీర్థప్రసాదాలను స్వీకరించారు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *