తొగుట మండలంలోని కాన్గల్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే జాతర మహోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని తొగుట మండల వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ కమిట్ చైర్మన్ దోమల కొమురయ్య ఆహ్వానించారు…
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ మరుసటి రోజు కాన్గల్ గ్రామములో ఉన్న దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం లో బండ్ల ఊరేగింపు మరియు జాతర మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు వారు తెలిపారు భక్తులు అందరూ రావాలని వారు కోరారు…కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లయ్య, ప్రశాంత్ తదితరులు ఉన్నారు
