
శ్రీ శ్రీ శ్రీ భావనంద విశ్వనాథ గురుదేవులు అనుగ్రహంతో పాండురంగాశ్రమం సంకల్పించిన శతకోటి హరే రామ నామ జప యజ్ఞంలో భాగంగా జగదేవపూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తనలు మరియు అఖండ హరే రామ భజనలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మాఘ బహుళ ఏకాదశి అయిన ఈ రోజు మునిగడప గ్రామంలో అద్భుతంగా 12 గంటల పాటు అఖండ హరే రామ నామ భజన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాండు రంగాశ్రమం గురువుగారు, భగవత్సేవ సమాజం జగదేవపూర్ శాఖ, దౌలపూర్ శాఖ, బొర్రగూడెం శాఖ, కొండాపూర్ శాఖ, లక్ష్మాపూర్ శాఖ, ఎర్రవల్లి వర్ధరాజపూర్ శాఖలు మరియు మునిగడప గ్రామస్థులు పాల్గొన్నారు



