హైదరాబాద్: కోకాపేటలో భారాసకు ॥ ఎకరాల భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది.





