రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ కి తిమ్మాపూర్ మండల ప్రజలు జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు
తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఆయన వేకువ జాము నుండి మధ్యాహ్నం వరకు తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్, మహాత్మా నగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, మక్తపల్లె, నల్లగొండ, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.
లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షుడు రావుల రమేష్, వైస్ ఎంపీపీ లాగ్యల వీరారెడ్డి, బిఆర్ఎస్ పార్టి రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఎలుక ఆంజనేయులు,పాశం అశోక్ రెడ్డి, దావు సంపంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ లు, మండల తాశిల్దార్ కనుకయ్య, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.