ప్లాస్టిక్ నిషేదానికి ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు.
పైలట్ ప్రాజెక్ట్ గా ఎల్లారెడ్డిపేట మండలం*. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను నిషేదించి బట్టసంచులను వాడాలని ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు.ఇందులో ఐకేపీ తదితర విభాగం అధికారులు టాస్క్ పోర్స్ టీమ్ గా ఏర్పాటుచేశారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అధికారులు ఎన్నుకున్నారు.ప్లాస్టిక్ రహిత మండలంగా ఏర్పాటు చేయడానికి అన్నిరకాల వ్యాపారులు సహకరించాలని ఎంపీడీఓ బింగి చిరంజీవి,ఎపిఎం
మల్లేశం,మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కోరారు.
