ఆధ్యాత్మికం

భక్తిరత్న రామకోటి రామరాజును ఆహ్వానించిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్

67 Views

గజ్వేల్ , ఆగస్టు 5

ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో జరిగే సేవారత్న పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కు గజ్వేల్ కు వచ్చి ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని సోమవారం నాడు అందజేసిన లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక, చైర్మన్, ప్రముఖ గాయని లక్ష్మీ ప్రసన్న.

ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తన సంస్థకు ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సామ శ్రీధర్ గుప్త సినీ నిర్మాత, గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పంజాల వెంకటేష్ గౌడ్, వంగపల్లి అంజయ్య స్వామి పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్