తెలంగాణలో ప్రభుత్వానికి ప్రజలే బలమని, వారే తమకు దేవుళ్లని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మన్నెంపల్లి ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ముద్రించిన 2023 క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఉన్న క్యాలెండర్‌ను తయారు చేయించిన అనిల్‌గౌడ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలే బీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమం విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్రం కక్షసాధింపు చర్యలను వివరించాలని తెలిపారు. ప్రజల అండతోనే బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుడు ఇ నుకొండ జితేందర్ రెడ్డి,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతీరెడ్డి దేవేందర్ రెడ్డి,ఎంపీటీసీ పుప్పాల కనకయ్య,సర్పంచ్ శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, దుండ్రా రాజయ్య,నాయిని వెంకట్ రెడ్డి,వంతాడుపుల సంపత్,గంగిపల్లి సంపత్, బోయిని తిరుపతి,కొయ్యడ మురళి, రైతు బంధు అధ్యక్షులు నాంపల్లి శంకరయ్య, కోలిపాక రజమొగిలి,గుంటి కిష్టయ్య, బినపెల్లీ బాలయ్య,అక్కేపల్లి కొమురయ్య, బినపెల్లి రాజయ్య, బినపెల్లి శ్రీనివాస్, బూడిద కిషోర్, కమేర సంపత్, బొజ్జ శ్రీను,రవి, పార్నంది జాలపతి,దుర్గం అశోక్, కిన్నేర సతీష్,రమేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
