ప్రాంతీయం

మాజీ సర్పంచ్ నర్సింలును పరామర్శించిన – దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్

128 Views

మండలంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు టెంకంపేట్ మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి లక్ష్మయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్ తో పాటు దౌల్తాబాద్ పిఏసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, రైతుబంధు మండల అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి, మున్న రాయపోల్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, సోమవారం మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలును పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు నర్సింలు తండ్రి లక్ష్మయ్య మృతి చెందడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింలు తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరమని ఆయనకు భరోసా కల్పించారు. కుటుంబ పెద్దదిక్కులు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన వెంట షాదుల్లా, సత్యం, రాజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *