ప్రాంతీయం

జె సి హెచ్ ఎస్ ఎల్ డైరీ ఆవిష్కరణ

67 Views

జె సి హెచ్ ఎస్ ఎల్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 27, తెలుగు న్యూస్ 24/7

హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ( జె సి హెచ్ ఎస్ ఎల్ ) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత సమాచారంతో కూడిన డైరీని మొదటిసారిగా రూపొందించామని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండబేరి గోపరాజు మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మేనేజింగ్ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాలతో సత్కరించగా, మంత్రి సొసైటీకి మరియు సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలోకార్యదర్శి మిక్కిలినేని రవీంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్ మసాదే లక్ష్మీనారాయణ,జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి,ట్రెజరర్ భీమగాని మహేష్,డైరెక్టర్లు డి. కమలాకరాచార్య , ఎం.ఎస్.హెచ్. హాష్మీ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *