ప్రాంతీయం

*కుటుంబ సమేతంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ **

109 Views

వేములవాడ 03, సెప్టెంబర్ 2022: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి వేణుగోపాల్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్ కు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు పుష్ప గుచ్ఛం అందించి
స్వాగతం పలికారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం జస్టిస్ వేణుగోపాల్ గారికి స్వస్తి ఆహ్వానం తో ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి వారి కళ్యాణ మండపం లో వేదోక్త ఆశీర్వచనం చేసినారు .ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు శేష వస్త్రం కప్పి, స్వామి వారి చిత్ర పటం, లడ్డు ప్రసాదం అందజేశారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7