ఈషా ఫౌండేషన్ వారు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో ఈ నెల 22 , 23 తేదీ లలో నిర్వహించనున్న జాతీయ స్థాయి త్రో బాల్ పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు ఎంపికయ్యారు. త్రో బాల్ తెలంగాణ మహిళా టీం కు రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు కెప్టెన్ ముద్ర కోలా అఖిల, రమ్య, సహన, భార్గవి, మనీషా రూపిక, రుచిత, దివ్య, కోచ్ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం వెళుతున్నారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ జెడ్ పి టి సి కార్యాలయంలో ఎంపికైన విద్యార్థులతో పాటు కోచ్ అనిల్ గౌడ్ ను జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అభినందించారు.ఈ సందర్భంగా జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు జాతీయ స్థాయి త్రో బాల్ పోటీల్లో గెలిచిరావాలని ఆకాంక్షిస్తూ వారి ఖర్చుల కోసం 10 వేల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీసం రాజం తదితరులు పాల్గొని విద్యార్థులకు బెస్టఫ్ లక్ తెలిపారు.
