రాయపోల్ ముద్దుబిడ్డ
దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు
తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియం లో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమం లో ప్రజా కవి రచయిత దరువు అంజన్న కు
ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా
ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్నో పోరాటాలు సాగించాడని, దాదాపు తెలంగాణ రాష్టం మొత్తం పల్లె పల్లె తిరిగి ఉద్యమ బావ జాలాన్ని, తెలంగాణ వెనకబాటు తనాన్ని తన పాట ద్వారా వినిపించడని,
తన జీవితాన్ని సైతం తెలంగాణ ఉద్యమనికే అంకితం చేశాడని,
చెరసాలలు, తుపాకి తూటాలను సైతం లెక్క చేయలేదని అంజన్న లాంటి గొప్ప నిజాయితీ గల్లా నీకార్సైన ఉద్యమ కారునికి ఈ నంది అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని కొనియాడారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దరువు అంజన్న తెలంగాణ అందరికి సూపరిచితుడని అంజన్న త్యాగం వెళ్లకట్టలేనిదని ఇలాంటి
త్యాగధనులను సన్మానిచడం సంతోషం అన్నారు. ఇద్దరు దరువు అంజన్న ఒక పల్లెటూరు నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యను అభ్యసించి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ కమిటీ కన్వీనర్ గా ఉన్నారు. పట్టుదరామంటే ఏదైనా సాధించవని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఏపూరి సోమన్న, ప్రజాకవి భైరగి, నేర్నాల కిషోర్,గిద్దె రాంనర్సయ్య,మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్,
దారదేవేందర్, వెన్నెల, యాకూబ్ ,దమ్మన్నపేట రాజు, బుల్లెట్ వెంకన్న, సురేందర్
రమేష్, మల్లంపల్లి రాజు, శైలజ,యాకన్న,స్వామి,సంజీవ్,అంజలీ మరియు సుమారు 500 మంది కవులు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమం నిర్భకులకు ముఖ్య అతిథులకు అంజన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.