Breaking News

కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌

72 Views

కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం.. నన్ను డిక్టేట్‌ చేయొద్దన్న రేవంత్‌ రెడ్డి.. మీటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన ఉత్తమ్‌

కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది.

పార్టీలో రెండు టికెట్ల విషయంలో చర్చ వాగ్వాదానికి దారితీసింది.

కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో చర్చ వాగ్వాదానికి దారితీసింది. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే అంశంపై అధిష్ఠానంతో చర్చించాలని ఉత్తమ్‌ అడగ్గా.. నన్ను డిక్టేట్‌ చేయొద్దంటూ రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్.. మీటింగ్‌ మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఈ వాగ్వాదం ఇప్పుడు కాంగ్రెస్‌ను హీటెక్కిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న ఆశవాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు పీఈసీ (పీసీసీ ఎలక్షన్‌ కమిటీ ) మంగళవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సామాజిక వర్గాల వారిగా కేటాయించిన స్థానాలపై చర్చ జరిగింది. మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని రేణుకా చౌదరి డిమాండ్‌ చేశారు. బీసీల లెక్క తేల్చాలని వీహెచ్‌, ఏ ప్రాతిపదికన సర్వేలు చేశారని బలరాం నాయక్‌ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఒకే కుటుంబానికి రెండు టికెట్ల అంశంపై కూడా ప్రస్తావన వచ్చింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్‌ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే టీపీసీసీ చీఫ్‌గా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయాన్ని హైకమాండ్‌కు సూచించాలని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో తనను డిక్టేట్‌ చేయొద్దంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీంతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *