మహాత్మా ఫూలే బాటలో బహుజన రాజ్యంలో విద్య వ్యవస్థ కు పెద్దపీట
గజ్వేల్ బీఎస్పీ కమిటీ నాయకులు
సీద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం భారత దేశ పితామహుడు,భారతదేశంలో చదువు బ్రహ్మణులకే పరిమితమైన చదువును, పుట్టిన ప్రతి పౌరునికి చదువుకునే హక్కు ఉండాలని పోరాడి,అనేక సామాజిక ,కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు చేసి,తన భార్య సావిత్రభాయి ఫూలేను ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగేలా కృషి చేసిన మహనీయులు, గులాంగిరి వంటి రచనల ద్వారా దేశ చరిత్రను విభిన్న రీతిలో అందించి,చైతన్యవంతులను చేసిన ఘనులు, మహాత్మ జ్యోతిరావు ఫూలే 196 వ జయంతి సందర్భంగా పూల మాల వేసి బిఎస్పి ఆధ్వర్యంలో గజ్వెల్ పట్టణంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిచడం జరిగింది.ఆయన ఆశలకు విరుద్దంగా అటు బీజేపీ, ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వాలు విద్య వ్యవస్థ ను నాశనం చేస్తూ బహుజనులా బతుకులను ఆగం చేస్తున్నావని విమర్శించారు.ఆ మహాత్ముని ఆశయ సాధనలో పనిచేస్తూ బహుజన రాజ్యంలో నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో అందిస్తామని జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం ,ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ ,కొండపాక మండల్ అధ్యక్షులు అందే భూపాల్ కుకునూరుపల్లి మండల్ అధ్యక్షులు ఆశని కనకప్రసాద్, జగదేవపూర్ మండల్ ఉపాధ్యక్షులు కనకయ్య ,బక్కోలా కరుణాకర్ ,డబ్బేట కిరణ్ చిన్నరజిని అనిల్ , వంశీ ,బివిఎఫ్ నాయకులు నాగరాజ్ ,సోషల్ మీడియా నాయకులూ కషర్ల గణేష్ ,శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు





