
గట్టు భాపురెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన గట్టు బాపురెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం శుక్రవారం రోజున మృతి చెందగా గురువారం రోజున బాపురెడ్డి భార్య తారవ్వ ను కుమారులైన గట్టు కృష్ణారెడ్డి,గట్టు శ్రీకాంత్ రెడ్డి లను జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పరామర్శించి మనోధైర్యం కలిగించారు. పరామర్శించిన వారిలో రెడ్డిసంఘం మండల అధ్యక్షులు కుంభాల మల్లారెడ్డి,ఆవునూరు గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు నక్క రాంరెడ్డి,పద్మారెడ్డి, యువనాయకులు గుర్రాల రాజిరెడ్డి,ఎల్లారెడ్డి పేట ఆంధ్రప్రభ రిపోర్టర్ గుర్రాల చంద్రమోహన్ రెడ్డి తదితరులు కలరు.





