Breaking News

ఎల్లారెడ్డిపేటలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

259 Views

ఎల్లారెడ్డిపేట సర్కిల్స్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించి,పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

  • అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ..
    ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం అని పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించాలన్నారు.. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ నీట్ టర్నవుట్ కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం పొందేలా చేయాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామలలో వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు..సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు. 100 డయల్ ఫిర్యాదుల పట్ల వేగవంతమైన స్పందన ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చెయ్యాలని అన్నారు..ఏకీకృత సేవలకోసం ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు..ఎస్పీ గారి వెంట డిఎస్పీ విస్వప్రసాద్, సి.ఐ మోగిలి, ఎస్.ఐ శేఖర్,సిబ్బంది పాల్గొన్నారు..
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *