ప్రాంతీయం

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సిపి

51 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీపీ *

బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) శుభాకాంక్షలు తెలిపారు.

రామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ వద్ద ఉన్న ఈద్గ ను సందర్శించి బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులకు సీపీ  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ…. బక్రీద్ పండుగ సందర్బంగా మసీదులు,దర్గాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం కమీషనరేట్ ప్రజలంతా బక్రీద్ పండుగ సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకుంటున్నారు. భక్తికి, త్యాగానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదన్నారు.

సిపి వెంట గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, రామగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ లు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్