ప్రాంతీయం

కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ ముగింపు

4 Views

కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ ముగింపు.

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో మరియు లక్షెట్టిపేట టౌన్ లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ముగింపు చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్  మాట్లాడుతూ అంబలి పంపిణీ కేంద్రాలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 41రోజులు మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద 37 రోజులు పంపిణీ చేయడం జరిగిందని, గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, మంచిర్యాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు, ఈ అంబలి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ , కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *