Breaking News

వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి వివేక్

32 Views

వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

మెదక్ జిల్లా హవెలి ఘనపూర్, రామాయంపేట మండల పరిధిలో వరద ముంపు ప్రభావిత గ్రామాలను కార్మిక, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి , స్థానిక ఎమ్మెల్యే రోహిత్  కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మైనoపల్లి హనుమంతరావు గారు కూడా పాల్గొన్నారు.

బూరుగుపల్లి, వాడ, దూప్ సింగ్ తాండాలలో వరద ప్రభావంతో బ్రిడ్జిలు తెగిపోవడం, రాలపోకలు నిలిచిపోవడం, పొలాల్లో వరి పంటలు నెలమట్టం కావడం, ఎక్కడికక్కడ కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం వంటి పరిస్థితులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి  మాట్లాడుతూ –

ముంపు ప్రాంతాల వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని,పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని, కూలిపోయిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, పూర్తిగా కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, విద్యుత్ సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన ఎస్టిమేట్లు సిద్ధం చేసి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *