కష్టాల్లో ఉన్న క్లాస్ మెంట్ కు చేయూతను అందించిన స్నేహితులు…. రిపోర్టర్ కరుణాకర్
50వేల 200 రూపాయలఆర్థిక సహాయం అందజేత
*దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వినతి*
ప్రజాపక్షం/ కొనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మాందాల మమత, భర్త సంతోష్ అనారోగ్యానికి గురై కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పేదవారు కావడంతో వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి మమత,తోకలిసి చదువుకున్న తోటి మిత్రులు 2005 -06 కు చెందిన పదవ తరగతి విద్యార్థులు యువ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మమత,ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమవంతుగా 50 వేల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాబోవు రోజుల్లో కూడా తమ వంతు సహాయం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సంతోష్ వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కష్టాల్లో ఉన్న తోటి మిత్రురాలిని ఆదుకున్న యువ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను పలువురు అభినందించారు.
