-శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో”ను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఏ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో” ను ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన షాడో జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమని అన్నారు.పోలీస్ జాగీలం షాడో కి హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ యాదవ్ మరియు ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు,సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 06 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.





