ప్రాంతీయం

నిరుపేదలకు చీరలు పంపిణీ…

118 Views
   ముస్తాబాద్ డిసెంబర్ 3 చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టినేని ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు లు  కెసిఆర్ కాలనీలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య ఆధ్వర్యంలోని నిరుపేదలకు 20 చీరలను పంపించేశారు. ఈసందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లు మండలంలోని ఎంతోమంది నిరుపేదలకు ఆయా  పాఠశాలల నిరుపేద విద్యార్థులకు దుస్తులు వృద్ధులకు దుప్పట్లు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు గ్రీజర్ కస్తూర్బా బాలికల పాఠశాలలు గీజర్ అందించారు. అంతేగాక నిరుపేదలకు ఆర్థిక సాయంతో పాటు ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులు అందిస్తున్న చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లకు వారి భావ విద్యాసాగర్ రావు కు నిరుపేదల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, మండల కో ఆప్షన్ సాదులపాప, యూత్ నాయకులు శీలం స్వామి, వార్డు సభ్యులు, నందు, తెరాస నాయకులు, యాదగిరి, జాంగిర్  తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్