మహిళలు అన్ని రంగాల్లో సాధికారిత సాధించాలి-అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్.
మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అన్ని రంగాల్లో సాధికారిత సాధించాలని అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని వందఫీట్ల రోడ్డులో గల కార్యాలయం లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు.
ఛైర్మన్ శ్రీధర్, ఎండీ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగంగా ఉన్నప్పుడే మహిళలు సాధికారత సాధించినట్లు అవుతుందని అన్నారు. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందని అన్నారు. మహిళల పట్ల పురుషులు ఆలోచన ధోరణి మారాలని అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. విద్యా, వైద్యం, రాజకీయం, వ్యాపారం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ సాధికారత దిశగా అడుగులు వేస్తూ పురుష శక్తికి తాము ఏమి తీసుపోమని చెబుతుందని స్త్రీ శక్తి అని అన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన సమాజ అభివృద్ధి కి మూలమని అన్నారు. లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ సాంకేతికలు, లింగ సమానత్వం వైపు పురోగతి సాధించి అన్ని రంగాల్లో మహిళలు సమాన అవకాశాలు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర ఎస్టేట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కిషన్, సంతోష్, డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
