ప్రాంతీయం

*షి టీం, డయల్ 100, సైబర్ క్రైమ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సబ్ ఇన్స్పెక్టర్ 

154 Views

 

 

జగదేవపూర్ విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి అన్నారు.

శుక్రవారం మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాల్య వివాహాలు , రోడ్డు భద్రత, సైబర్ నేరాలు మహిళా భద్రత,ఈవ్ తీసింగ్** షీటీమ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా *సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి* మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బాల్యవివాహాలు చేసుకోవద్దని చేసుకున్నచో ఇద్దరికీ సమస్యలు వస్తాయని,విద్యార్థి దశలో ఉన్నతంగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. విద్యార్థునిలు స్కూల్ లో చదువుకునే సమయంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని, చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవించాలని తెలిపారు.

ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించిన్నప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందని భావితరాలకు మీరే మార్గదర్శకాలు కావాలన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, సూచించారు. పోక్సో, బాల్య వివాహాల చట్టాల గురించి వివరించారు. మరియు సైబర్ క్రైమ్, షీ టీమ్స్, ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు ఏదైనా అవసరం ఉంటే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్స్అప్ నెంబర్ *7901100100*, లేదా షిటీమ్ వాట్సప్ నెంబర్ *7901640473* ఫోన్ చేసినచో మరియు (ఫేస్ బుక్, sdptsheteam,)(మెయిల్,sdptsheteam@gmail.com), (ట్విట్టర్, @sdptsheteam) పిర్యాదు చేసినచో, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కానిస్టేబుళ్లు ,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *