జగదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కొండేటిచెరువు సర్పంచ్ చెరుకు కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డు పొందిన మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ ను శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు.
ఈసందర్భంగా సర్పంచ్ కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ రాగుల రాజు జగదేవపూర్ మండలం లో ముదిరాజ్ లను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు కు హైదరాబాద్ లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బీసీ రత్న రాష్ట్ర అవార్డు రావడం అభినందనీయం అని వారికి చిరు సన్మానం చేయడం జరిగింది అని ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని కోరుకోవడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రం. శ్రీశైలం,గణేష్,కర్రె గణేష్, బాస్కర్, ఉప్పరి రాజు,బాలరాజు,నాగరాజు,సత్యనారాయణ,నవీన్, రమేష్,భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
