జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య కో అప్షన్ ఎక్బల్ కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు, బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మహనీయులను సముచితంగా గౌరవించాలని గ్రామస్తులు నిర్ణయంతో ఒకేసారి అంబేద్కర్ తెలంగాణ తల్లి శివాజీ విగ్రహాలకు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రధాన రోడ్డులో బస్టాండ్ లేక విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందుల గురవుతున్నారని బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రధాన కూడలిలో బస్టాండ్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశామన్నారు పై విగ్రహాల ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ తీసుకొని వెంటనే నిర్మాణాలు చేపడతామన్నారు కార్యక్రమంలో నాయకులు ఉపసర్పంచ్ ఆజం, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య, సీనియర్ నాయకులు బండారు నరసింహులు, రాములు గౌడ్, అంబేద్కర్ సంఘం నాయకులు వెంకటేష్, యాదయ్య,పోషయ,విష్ణు,కరుణాకర్,బాలాజీ, టిఆర్ఎస్ నాయకులు రాజు,లింగం,దేశి రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు