ముస్తాబాద్, ఫిబ్రవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ కులస్తుల సంక్షేమ సంఘం ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలసి గౌడ కులస్తుల ఆరాధ్య ఇష్టదేవత తాళ్లల్లో వెలసిన ఎల్లమ్మ ఆలయంవద్ద నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మా కులవృత్తిని నమ్ముకుని ప్రస్తుత కాలానికి అనుగుణంగా జీవనం సాగిస్తున్న మాగౌడ కుటుంబాలను అన్నిరంగాల్లో రాణించి అదేవిధంగా మాగీత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తూ మేము నమ్ముకున్న ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండ యాదగిరిగౌడ్, గుండెల్లి రాములు, బుర్ర రాములుగౌడ్, ఎంపిటి చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దేవదాస్, అయోధ్య, రాజారాం, చిన్న బాలయ్య, బొంగోని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
