Breaking News

కెసిఆర్ జన్మదినాన్ని సందర్భంగా పేదలకు అన్నదానం

103 Views

ప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 15 :

తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మంగళవారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ,
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని అన్నదాన కార్యక్రమం వద్ద ఏర్పాటు చేశారు ,
ఈ సందర్భంగా జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదాత కెసిఆర్ గారి జన్మదిన లో భాగంగా మంగళవారం పేదలకు అన్నదాన కార్యక్రమం, బుధవారం రక్తదాన శిబిరం , గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు,
సబ్బండ వర్గాల ప్రజలతో కలసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారని ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేపట్ట లేదన్నారు, అనంతరం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణ హరి , సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అందె సుభాష్ , గుల్ల పెళ్లి నరసింహారెడ్డి , సెస్ మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి ,ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మామిండ్ల తిరుపతి బాబు, ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీలు పందిళ్ళ నాగరాణి పరశురామ్ గౌడ్ , ఎలగందుల అనసూయ నరసింహులు , సింగారం మధు మహమ్మద్ సుల్తానా , ఉప్పుల మల్లేశం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ ,మండల యూత్ అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్ , మహిళా మండల అధ్యక్షురాలు మహమ్మద్ అప్సరా ఓన్నీషా అజ్జు , సీనియర్ నాయకులు నంది కిషన్‌ , మీసం రాజం , జంగ అంజి రెడ్డి , టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి ,వివిధ గ్రామాల సర్పంచులు , వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7