Breaking News

ఆపరేషన్ ముస్కాన్- XI నిర్వహణ పై సమీక్ష సమావేశం

7 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

ఆపరేషన్ ముస్కాన్- XI నిర్వహణ పై సమీక్ష సమావేశం.

బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: పెద్దపల్లి డీసీపీ కరుణాకర్

జూలై 1 నుండి 31-07-2025 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-XI నిర్వహణ గురించి రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లి జిల్లా ఆపరేషన్ ముస్కాన్-XI టీమ్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు తో డిసిపి  కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డిసీపీ  మాట్లాడుతూ.. గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులగా పనిచేస్తున్న హాట్ స్పాట్స్ పై నిఘా ఉంచాలి. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలి. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించి వారిని మరల స్కూల్ లలో చేర్పించాలి అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల ను గుర్తించి వారిని సంబందిత హాస్పిటల్లో చేర్పించి పరిక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలి. ప్రతి షాప్స్ వద్ద “No Child Labour are employed here” బోర్డ్స్ ఏర్పాటు చేపించాలి. బాల్య వివాహాల చేయడం నేరం. బాల్య వివాహలపై అవగాహన కల్పించాలి. 18 సంవత్సరాల లోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్ లలొ పని చేసిన, పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయిన, వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం చేయాలని అన్నారు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి *”DARPHAN”* అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకొంటామని, ఆపరేషన్ ముస్కాన్ -XI లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. విరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్-XI నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, తప్పిపోయిన, వదిలివేయబడిన, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, 112, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని డిసీపీ  తెలిపారు.

ఈ సమావేశంలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ దివ్య, శైలజ, వేణు గోపాల్, CWC చైర్ పర్సన్ శ్రీధర్, జి. చంద్రయ్య, MEO రామగుండం, శ్యామ్ సుందర్ CWC మెంబెర్, డాక్టర్ రాజమౌళి ప్రోగ్రాం ఆఫీసర్, రవీందర్ ALO మంథని, DWO వేణు, DCPO జితేందర్, CWC మెంబర్ సుమలత, ఉమాదేవి CHC కోఆర్డినేటర్, WCD శ్యామల, శారదా AO, DEO ఆఫీస్, హేమలత, ALO పెద్దపల్లి, శ్రీనాథ్ ALO, ఆఫీస్ పెద్దపల్లి, ఆపరేషన్ ముస్కాన్ టీం పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్